ప్రేమ, బాంధవ్యాలకు ఇద్దరు జీవులు ఉంటేనే సాధ్యం. అద్వైత సాధనలో దయ చూపించ కూడదని,
ప్రేమను క్రియారూపంలోకి తీసుకు రాకూడదని అనుకుంటాం. సాధన బాగా
సాగుతున్నకొద్దీ అసలైన ప్రేమ తెలుస్తుంది. చివరి దశలో దేన్ని పొందదలుచుకున్నామో దాన్ని చేరి, అందు లీనమైతే ఇక సాధకుడు మిగలడు గనుక అది
అద్వైతమే. అహంవృత్తి అణిగితే అపుడు సాక్షాత్కారమే. ఇలా లీనమవ్వడానికి తనను తాను
త్యాగం చేసుకోవడమే ఉంటుంది. అదే పరాభక్తి. జీవాహంకారం పోగొట్టుకోడం అంత తేలికైన
పనేమీ కాదు. వాసనలన్నీ నశిస్తేనే అది తొలగుతుంది. జీవాహంకారాన్ని జీవాహంకారం తోనే
పోగొట్టాలి. అన్ని ప్రయత్నాలూ, ఫలాలూ జీవునిపైనే ఆధారపడి
ఉంటాయి. అంచేత ఇది అహంకారంతో కూడిన పనే. సాధన మొదట్లో అహంకారం మన పురోగతిని,
చేసే తప్పులను కూడా చూపి, పతనం గాకుండా
చేస్తుంది. సాధన అంతా అహంకారంతో కూడిన జీవునికే. ఆత్మ నిష్క్రియం గనుక అది ఆత్మగానే
ఉంటుంది.
జీవుడి పనులన్నీ అహంకారం మీదే
అధారపడుతాయి. అంచేత నేను అనేది పూర్తిగా లేదనుకో కూడదు. అలా అనుకుంటే ప్రయత్నమే
ఉండదు గదా! సాధన చెయ్యగా చెయ్యగా మనస్సు దానిపై అంటే బ్రహ్మంపైనే ఉంటుంది. ఏవేవి
విడచిపెట్టాలో వాట్ని విడిచే దశకు చేరుకున్నాడు. కాబట్టి ఇకనుంచీ అంతా భగవదనుగ్రహం
మీదే ముందుకు సాగుతుంది. అంటే ప్రయత్నమని, ఫలమని విడిగా చెప్పలేం.
ఇప్పటి వరకూ సాధనతో శుద్ధమైన అంతఃకరణం అనుభవ దశకు చేరుకోవాలి. చేరుకోడం
అనేదానికన్నా ఇక ఇవ్వడమే/ అర్పణభావమే ఉంటుంది. అందుకే శమాదిషట్కసంపత్తిని పొందాకా నిన్ను నీవు ఖాళీ చేసుకోడానికే,
భక్తి ఉద్దేశించ బడింది. భక్తివల్ల ప్రేమ, వినయమూ అబ్బుతాయి. అలాంటి ప్రేమ, వినయములతో గల భక్తిలో సాధన ముందుకు
సాగుతూంటే, ఇంతవరకూ సాధనవల్ల తేలికైన మనస్సు, బుధ్ధీ అహంకారం చేత లాగబడి
హృదయంలోకి ప్రవేశపెట్ట గలగాలి. భక్తిలో ఆత్మనివేదనం ఉంటుంది. అంతా నీ సంకల్పమే అనే
స్థితి యిది. అంటే ఇక సంకల్ప
వికల్పాలుండవు. అంచేత మనస్సుకు, బుద్ధికీ ఇంకేమీ పని లేదు.
అసలైన భక్తి అహంకారం నుండే పుడుతుంది. ఇలాంటి భక్తి అహంకారాన్ని వృద్ది చెయ్యదు
సరికదా , అహంకారాన్ని ఆత్మలో లీనమయ్యేట్లు చేస్తుంది. లీనం
చెయ్యాలన్నప్పుడు లీనం చెయ్యాలని కోరేవాడు ఒకడు ఉండాలి. అలా ఆత్మలో లీనమవ్వాలని
కోరేదే ఇక్కడి అహంకారం. అంటే ఇక్కడ
భక్తితో ఉన్నాననే అహంకారాన్ని ప్రేమతో లీనం చెయ్యడమే లక్ష్యం. భక్తియే ఇక్కడ
అహంకారాన్ని బాగా పలుచబడేటట్లు చేసి, అది పలుచబడగా పలుచబడగా
ఇక అహంకారం తనకు నిలయమైన హృదయం చేరగా,
హృదయమే భక్తికి నిలయమవుతుందన్న మాట. ఇలా భక్తిలో పరిణతి
చెందినప్పుడు సన్యాసం స్వీకరించి, భక్తితో అహంకారాన్ని క్రమంగా లీనం చేస్తుండగా శ్రవణ మనన
నిదిధ్యాసనలను అభ్యసిస్తాడు. ఈ దశలో భక్తి శీఘ్రంగా మొలకెత్తుతూ హృదయమంతా
నిండినప్పుడు అహంకారం పూర్తిగా నిర్మూలించ బడుతుంది. అహంకారం పూర్తిగా
నిర్మూలించబడే ముందు ఈ స్థానం అణువుల రూపంలో , భక్తితో
నిండియున్న భౌతిక హృదయం వలె ఉంటుందని అంటారు.
ఎన్నో చక్కటి విషయములను తెలియజేస్తున్నందుకు మీకు ధన్యవాదములండి.
ReplyDeleteమీ అభిమానానికి కృతజ్ఞతలండి.
ReplyDeleteసూర్యచంద్ర గోళ్ల .
Very useful information Sir.
ReplyDelete