Thursday, November 8, 2012

కుండలిని - 6

కుండలిని - 6


విశుద్ధము
విశుద్ది- ఆకాశ సంబంధమైనదగుటచే  కంఠస్థానమున చెప్పబడినది. శ్రోత్రేంద్రియ సంబంధ మైనది. జాగ్రత్తు, స్వప్నము, సుషుప్తి, తురీయము అను  అవస్థల యందు తెలియదగు స్థితులకిది స్థానము. ఈ స్థితులే షోడశ దళములుగా చెప్పబడిన పద్మము పరాశక్తికి స్థానము. వర్తులాకారమున నీల వర్ణమున నుండు ఈ కమలమున వేణునాదము తెలియ నగును.  ఇచ్చట సప్త స్వరములు పుట్టుటచే శబ్ద సంబంధము వల్ల వాక్కునకు స్థానము. దీనియందు పరిశుద్దుడగు ప్రత్యగాత్మ యగు జీవుడు ఉండును.

విశుద్దిచక్రము పదహారు దళములతో కూడిన పద్మముగా  క౦ఠమునందు గలదు. మనస్సునకు పుట్టుక స్థానము. ఇది శరీరమందు ఆకర్షణ వికర్షణలు ఇంద్రియముల ద్వారా కల్గుచోటు. "హం" దీని బీజాక్షరము. దీనివల్ల విజ్ఞానము , శాస్త్ర పరిజ్ఞానము మేల్కొనును. ఇంద్రియ నిగ్రహము గలవానికి ఇది మోక్ష ద్వారము. దీనిని ధ్యానించువాడు రాగ శోకముల నుండి విముక్తుడగును. తనయందున్న శ్వాసపై మనస్సు లయమైనవాడు అంతర్యామిని దర్శించి, అతని కరుణచే తన  శరీరము నిలబడియున్నదని గుర్తించి, ఆ శ్వాసయందు తన మనస్సుచే శరణాగతి చెందును. శరణాగతి వల్ల శరీరముతో బంధము తెగిపోవును.





విశుద్ది బీజాక్షరం- హంగ్. పదహారు దళములు కల్గిన నీలిరంగు పద్మం. మధ్యలో నీలిరంగు గల చంద్రవంక. ఈ చంద్రవంక క్రింది భాగంలో పసుపు పచ్చని జ్యోతి. కంఠమూలమున నుండును. గొప్ప ప్రకాశవంత మైనదగుటచే విశుద్ధి అని చెప్పబడినది. 

No comments:

Post a Comment