Thursday, November 15, 2012

కుండలిని - 7


ఆజ్ఞాచక్రము 


భ్రూమధ్యమున గల రెండు దళముల పద్మము. మాణిక్య వర్ణము గలది . ఇది మనస్సు, బుధ్ధి, చిత్తము, అహంకారములనే  అంతఃకరణమునకు స్థానము. కంఠస్థానమున మనస్సు చెప్పబడినా,ఇంద్రియ వ్యాపారములు చేయుటకు మనస్సు ఆజ్ఞాచక్రమునకు వచ్చును. అందువల్ల మనస్సునకుగల సంకల్ప వికల్పములు ఈ పద్మమునకు రెండు దళములుగా చెప్పబడినవి. ఇది చిచ్చక్తికి స్థానము. ఇచట చిచ్చక్తితో కూడిన మాయాధిష్టాన చైతన్యస్వరూపుడగు మహేశ్వరుడుండు స్థానము.

అజ్ఞాచక్రము రెండు దళములు  గల పద్మము. కనురెప్పల పైభాగమున నుండును . దీనివల్ల  బుద్ది మేల్కొని ముముక్షత్వము , సత్యదర్శనము కల్గును. జీవుల విషయాలోచనలు ఇందే కల్గుచున్నవి. ఇట్టి ఆలోచనలనుండి క్రమముగా  ఆలోచనలులేని స్థితిలోనికి మారును. ఇందు స్త్రీపురుష లక్షణములు కలసియున్నవి.  లింగబేధ మేర్పడుటకు ముందున్నస్థితి. సృష్టికి ఇదే కారణముగా ఉన్నది. అంతర్యామియైన పరమాత్మ నుండి ఆయన శక్తి వేరై రాగా, అట్టి శక్తియందు మరల పరమాత్మయే ప్రవేశించుచున్నాడు. ఇదియే సృష్టికి మొదటి కారణము. ఇదే భౌతికలోకమున దాంపత్యమై, జీవుల భౌతికదేహముల కలయికద్వారా కామమనుపేర ఉపాసించ బడుచున్నది.  కామభావమువల్ల కల్గు తన్మయత్వము తెలియకుండగనే ఉపాసించబడి, స్త్రీపురుష ఐక్యతగా పరిణమించు చున్నది. కొంతకాలమునకిది కామవాసన లేని ప్రేమగా మార్పుచెంది నిర్మలమగు ప్రేమ అగును. ఇదే జీవికి, జీవికి నడుమ నుండవలసినది.





దీనికి "ఓం"కారము బీజాక్షరము. దీనిని స్థిర చిత్తముతో ధ్యానించుచు, తనయందు ఉచ్చ్వాస నిశ్వాసములను నడుపుశక్తిని గమనించవలెను. అపుడు ఓం కారము అప్రయత్నముగా ఉచ్చరించబడి అంతర్యామి అయిన పరమాత్మ ఓం కారరూపమున మేల్కొనును. ఇట్టి నిరంతర ధ్యానమువలన మనస్సు నిర్మలమై సూక్ష్మస్థితిని పొందును.  '' కార, '' కార , '' కారముల నుండి 'ఓం' కారమను ప్రణవము పుట్టుచున్నది.

ఆజ్నేయచక్రము యొక్క బీజాక్షరం- 'ఓం' .  వైలెట్ (ఊదా)రంగు గల రెండు దళముల పద్మం. దీనికి కుడివేపున సూర్యుడు, ఎడమ వేపున చంద్రుడు. మధ్యలో బూడిద రంగుగల శివలింగము ఉండును.


No comments:

Post a Comment