ఉద్వేగాలను, ప్రేరణలను, భావావేశాలను,
అభిప్రాయాలను, చిత్తవృత్తులను మన అధీనంలో ఉంచితే మనస్సుయొక్క బానిసత్వం నుండి
బయటపడి, తిరిగి మన అసలైన స్వరూపాన్ని పొంది మహారాజులా జీవించ గల్గుతాం. అపుడు
మనస్సు మన సేవకుడిగా మన ఇచ్చమేరకు పనిచేస్తుంది. హఠయోగి ప్రాణాయామంతో శ్వాసపై
పట్టుతో మనస్సును ఏకాగ్రం చేస్తాడు. రాజయోగి చిత్తవృత్తి నిరోధాన్ని సాధనతో
పొందుతాడు. ధ్యానం మనస్సు నుంచే ప్రారంభమవుతుంది. సగుణ, నిర్గుణాల్లో దేన్నైనా
ఎంచుకోవచ్చు. నిర్గుణంలో ఆత్మపై కేంద్రీకరించాలి. ప్రపంచం లేదు, శరీరము, మనస్సూ
లేవు. స్వచ్చమైన చైతన్యమే ఉంది. ఆ చైతన్యమే నేను అనేది నిర్గుణ ధ్యానం. ఓం
ప్రతిమను ముందుంచుకొని దానిపై కళ్ళు తెరచి దాన్ని ఏకాగ్రంగా కంటినుండి నీరు
వచ్చేదాకా చూడాలి. ఇది సగుణ, నిర్గుణోపాసనలలోకి వస్తుంది. మనస్సునుంచే ధ్యానం
మొదలవుతుంది కాబట్టి దాన్నే బ్రహ్మమని ధ్యానించ వచ్చు. ఓంకార ధ్యానంతో గాని, అహం
బ్రహ్మస్మి చింతనతో గాని బ్రహ్మాకార వృత్తిని ఎక్కువ సేపు పొంద ప్రయత్నించాలి.
తప్పొప్పులనేవి తారతమ్యాన్ని బట్టి ఉండేవి. ఎవరి దృష్టికోణం నుండి వారు సబబే. మనస్సే వీటిని రూపకల్పన చేస్తుంది. మన కర్మాచరణ ప్రజాబాహుళ్యం యొక్క మన్ననలను పొందాలి. మన అలవాట్లు చేతనావస్థలో (జాగ్రత్తులో)ఏర్పడి, అచేతనంగా అంటే మనకు తెలియకుండానే నిక్షిప్తమై ఉండి ఆ అలవాట్లవల్ల అది మన రెండో స్వభావంగా మారుతుంది. ఇలాంటి అలవాట్లనుకూడా పురుషప్రయత్నంతో మార్చుకోవచ్చును. సూక్ష్మము, పరిశుద్ధము ఐన బ్రహ్మమును అట్టి పరిశుద్ధమైన / నిర్మలమైన మనస్సుతోనే ప్రయత్నించాలి.
ఆసనాలు శరీరాన్ని నిశ్చలంగా ఉంచుతాయి. బంధ,ముద్రలు శరీరాన్ని దృఢంగాఉంచుతాయి. ప్రాణాయామం శరీరం తేలికగా ఉండేట్లు చేస్తుంది. నాడీశుద్ది మనస్సును సామ్యావస్థలో ఉంచుతుంది. అప్పుడే మనస్సును బ్రహ్మంపై లగ్నం చెయ్యాలి. శ్వాస రెండు మొక్కురంద్రాల్లోను సమంగా ప్రసరిస్తే సుషున్నూ పనిచేసి ధ్యానం సులభంగాను, ఆనందదాయకంగాను ఉంటుంది. మనస్సు ప్రశాంతమై నిర్మలంగా ఉంటుంది. అనంతమైన ఆత్మమీద చింతన చెయ్యాలి. మార్పుచెందని కాంతిప్రకాశంతో సన్నిహితంగా ఉన్నట్లు, మనఆత్మను మనలో లోపాలను ఆ కాంతిసాగరం శుభ్రపరచి ప్రేమతో మనలో ప్రతీకణాన్నీ తాకుతూన్నట్లుగా భావిస్తూండాలి. క్రమంగా ఒక నూతనమైన నేనుగా రూపుదిద్దుకుంటాం.

Very interesting. I went through your post for the first time. Good work.
ReplyDeleteThanks for your appreciation.
DeleteDr. Surya Chandra Golla.