గత సంవత్సర కాలం నుండి ఈ బ్లాగును
ప్రోత్సహిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు.
ఇప్పటివరకూ బేసిగ్గా/ మౌలికంగా ఉండే ఆధ్యాత్మిక
విషయాలను మాత్రమే తెలుసుకున్నాం. ఇలాంటి విషయాలను తెలుసుకోవాలనుకునే వారికి
ప్రారంభదశలో ఎక్కువ వ్యయప్రయాసలకు లోనవ్వలసిన అవుసరం లేకుండా ముఖ్యమైన విషయాలను
ఒకచోట ఈ బ్లాగులో పొందుపరచడం జరిగింది. ఎందఱో మహానుభావులు. ఎన్నో పుస్తకాలు,
గ్రంధాలు ఔత్సాహికులకు అందుబాటులో ఉంచారు.
అవి చాలామట్టుకు ప్రారంభదశలోవారికి అర్ధమయ్యే భాషలో లేవు. సామాన్యులకు సైతం
అర్ధమవ్వాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. సాధ్యమైనంత సులభతరమైన భాషను ఉపయోగించి ఈ
బ్లాగులో వివిధమైన విషయాలను ఉంచడం జరిగింది.
తిరిగి సమీక్ష చేసేపుడు క్లిష్టమైన విషయాలను
సులభతరం చెయ్యడానికి ప్రయత్నిస్తాను. ఇంతదాకా ప్రాధమిక విషయాలే తెలుసుకున్నాం.
మరింత లోతుగా/ ఉన్నతమైన విషయాలను
తెలుసుకునేముందు, చెప్పుకున్న విషయాలను ఒకసారి క్లుప్తంగా సమీక్షచేసుకోడంవల్ల
విషయం బాగా తెలిసి చెప్పబోయే విషయాలను గ్రహించడానికి మరింత ఉపకరిస్తుంది. దీన్ని
సింహావలోకనం/ లేదా To sum up అని అందాం.
అందరికీ ధన్యవాదములు.
ఇట్లు,
సూర్యచంద్రరావు గోళ్ల.
ReplyDeleteమీరు మరెన్నో చక్కటి విషయాలను తెలియజేయాలని కోరుకుంటున్నానండి.