సమాధానం :-
క్రింది స్థాయిసమాధిని శమాదిషట్కంలో సమాధానం అంటారు. ఇది అప్రయత్నంగా
సిద్ధించే సమాధిస్థితి గనుక ఇది సాధనగా చెప్పబడలేదు. మనస్సును /చిత్తాన్ని ఒకచోట సంపూర్ణంగాను, నిలకడగాను ఉంచడాన్ని సమాధానమని అంటారు. ఒక సమయంలో
అనేకమైన విషయాలను చింతించే దాన్ని ఒకచోట కదలకుండా ఉంచడం సమాధానం. మనస్సును కలపడం.
అంటే దాన్ని ఒకచోట సంపూర్ణంగా ఉంచడం. అటూ ఇటూ కదలకుండా ఉంచడాన్ని సమాధానం అంటారు.
దీన్లో ఉండేది బ్రహ్మముతో ఏకత్వమే. సమాధానం వల్ల మనస్సు విశ్రాంతంగా ఉంటుంది.
“శంకరులు శ్రద్ధనుగురించి
చెప్పేటపుడు మనస్సులోనే విశ్వాసం ఉంచాలని చెబుతూ బుద్ధితో నిశ్చయించి అని చెప్పారు. సమాధానం గురించి చెప్పేటప్పుడు
బుధ్ధి అనే పదాన్నే వాడారు. బుద్ధిని ఎల్లపుడూ బ్రహ్మమునందే సరైన రీతిలో ఉంచడాన్ని
సమాధానమని అన్నారు. అంటే బుద్ధి తన సమస్త శక్తులను ధారబోసి బ్రహ్మంపై లగ్నం
కావాలి. ఇదే, బుద్ధిని సరిగ్గా ఉంచడమంటే( సమ్యగ్ స్థాపనం ). ఇలా నిరంతరమూ
కొనసాగటాన్ని బుధ్ధియొక్క సమాధానం అంటారు. మనస్సు ఏది మంచి అనుభవమో, ఏదికాదో తెలియక అన్నిటిలోనూ మునిగి ఉంటుంది. ఆవేశంలో కొట్టుకుపోకుండా ఏది సత్యమో, ఏది అసత్యమో బుధ్ధి మంచి చెడుల న్యాయనిర్ణయం
చేస్తుంది. ఇలాంటి బుధ్ధికూడా ఇక్కడ ప్రక్కకు తప్పుకోవాలి సమాధానంలో”.
క్రిందిదశలో బుద్ధికి బాగా
పదునుపెట్టాలి. అలాంటి పదునైన బుధ్ధి, నిత్యానిత్య వస్తువివేకం
చేస్తుంది. ఇప్పుడు చెప్పుకున్న సమాధానంలో సాధకుడు ఒకస్థాయికి చేరుకున్నాడు.
బుద్దినుంచి తెలుసుకోవలసిన జ్ఞానంతో అతడికి ఏ సంబంధమూ లేదు. అన్నివేళలా బ్రహ్మమును
గురించిన చింతనే ఉంటుంది. అందుకే ఇక్కడ బుద్ధిని కూడా విడవాలి. ఇది రెండోదశ
అనవచ్చు. సమాధానం అనేది క్రిందిస్థాయి సమాధి అని చెప్పుకున్నాం.
ఇక మూడవదశ సమాధిలో బుద్ధిని బ్రహ్మమనే
సముద్రంలో ముంచెయ్యాలి. అంటే బుద్ధి తన సమస్త శక్తులను ధారబోసి బ్రహ్మంపై లగ్నం
కావాలి. ఇదే బుద్ధిని సరిగ్గా ఉంచడమంటే( సమ్యగ్ స్థాపనం ). ఇలా నిరంతరమూ
కొనసాగటాన్ని బుధ్ధియొక్క సమాధానమని చెప్పుకున్నాం. కాని ఇక్కడ బ్రహ్మానుభవం ఇంకా
కాలేదు. అది చివరన వస్తుంది. ఐతే బుద్ధిని శుద్ధబ్రహ్మముపై లగ్నం చెయ్యడం అంటే, బ్రహ్మమును గురించి చెప్పబడ్డ శాస్త్ర విషయాలమీద,
గురువు బోధించిన ఆత్మ విషయాలపైనా, బ్రహమును
గురించిన బుద్ధిజ్ఞానంపైన ఏకాగ్రతతో
బుద్ధిని ఉంచాలి. ఇదే బుద్ధియొక్క సమాధానమని కంచిపీఠాధిపతి శ్రీ చంద్రశేఖర స్వామి వారు అద్వైతసాధన అనే
ఉపన్యాసాల సంపుటిలో చెబుతారు.
ప్రస్తుతం సాధకుడు ధ్యానంలో, బుద్ధిని ఆత్మలోలీనం చెయ్యడానికి కావలసిన సమర్ధత ఇంకా
రాలేదు. అంచేత బుద్ధి తన వ్యాపార మైన శాస్త్రవిషయాలు, ఆత్మగురించి
తెలిసుకున్న విషయాలమీదా పనిచేస్తుంది. అదే
చివరకు ఆధ్యాత్మిక ప్రగతికి దారి చూపిస్తుంది.
సాధన తొలిదశ- నిత్యానిత్యవివేకంలో
బుద్ధికి బాగా పదును పెట్టాలి. ఎపుడు ఆత్మ సాధకుడయ్యాడో, ఇక బాహ్య ప్రపంచజ్ఞానం గాని, మిగిలిన
విషయాలను గాని తెలుసుకోవలసిన అవుసరం అతనికి ఉండదు. బ్రహ్మచింతనలోనే నిరంతరమూ
ఉంటాడు. అంటే సమాధి స్థితి ఉన్నతమయ్యేకొద్దీ (మూడవ దశ సమాధిలో) బ్రహ్మమనే
సముద్రంలో బుద్ధిని ముంచెయ్యాలి. మనం ఏ జ్ఞానాన్నైనా తెలుసుకునేది
బుద్దితోనే. అట్టి బుధ్ధి, ఇక్కడ తన శక్తులన్నిటినీ ధారపోసి బ్రహ్మంపైనే లగ్నం కావాలి. ఇదే సమ్యగ్ స్థాపనమంటే.
ఇలా నిరంతరం కొనసాగించడాన్ని బుధ్ధియొక్క సమాధానం అంటాం. ధ్యానంలో కూర్చుని బుద్ధిని,
ఆత్మలోలీనం చెయ్యలేకపోతే బుధ్ధి పనిచేస్తూంటుంది. శాస్త్రాలు,
ఆత్మను గురించిన విషయాలపైకీ
బుధ్ధి పోతుంటుంది. అంటే ఈ దశలో బుద్ధిని సంపూర్ణంగా బ్రహ్మమందు స్థిరంగా
ఉంచడమే సమాధానం.
ముందుదశలో సాధకుడు నిత్యానిత్యవస్తు
వివేకంలో బుద్ధికి పదును పెట్టాలి. రెండవ దశకు చేరుకున్న సాధకుడికి జ్ఞానం యొక్క
ఆవశ్యకత ఉండదు/ లేదు. అందుకే సమాధానంలో జ్ఞానానికి కారణంగాఉండే బుధ్ధి కూడా
ప్రక్కకు తప్పుకోవాలి. అందుకే క్రిందిదశ సమాధిగా చెప్పే సమాధానంలోనే బుధ్ధి
ప్రస్తావన. మూడవదశలో సమాధిస్థితి ఉన్నతం
అయ్యే కొలదీ బ్రహ్మమనే సముద్రంలో బుద్ధిని ముంచి వెయ్యాలి. బ్రహ్మానుభవం చివరనే వస్తుంది. బుద్ధిని
శుద్ధబ్రహ్మముపై సంపూర్ణంగా నిలపాలి అంటే – ఇక్కడ – బ్రహ్మమును గురించి చెప్పిన శాస్త్రంపైనా, గురూపదేశంపైనా
బుద్ధిని ఏకాగ్రతతో ఉంచడం అని విజ్ఞుల అభిప్రాయం.
How to get free coins online - Shootercasino
ReplyDeleteWin Free Coins online - 바카라 Win money from real coins online. Start playing free casino games now, the same game as you do 메리트카지노 for the online casino online. 제왕 카지노