కుండలిని - 3
ముందుగా శ్వాసను కొద్దిసేపు గమనిస్తే నెమ్మదవుతుంది. అప్పుడు చక్ర ధ్యానం
మొదలు పెట్టాలి. పూర్తిగా గాలి లోపలికి
పీల్చి , గాలిని నెమ్మదిగా బీజాక్షరాన్ని పలుకుతూ వదులుతూండాలి. ఈ బీజాక్షరాన్ని ఉచ్చారణ చేసే టప్పుడు తుమ్మెద
ఝాం కారం చేసినట్లు శబ్దతరంగం (vibration) రావాలని చెబుతారు. నాలుక వెనుకకు మడతపెట్టి బీజాక్షరాన్ని చెప్పాలి. ఇక శ్వాస ఉండబట్ట లేకపోతే మళ్ళీ దీర్ఘంగా
శ్వాస తీసుకొని ఇదే తంతును మళ్ళీ మళ్ళీ చేస్తూండాలి. మధ్యలో విరామం తీసుకో కూడదు.
అంచేత ఎంత ఊపిరి పట్ట గలిగితే అంతే అలవాటు చేసుకొంటూ క్రమేపీ పెంచు కోవచ్చు. అలా
ఒక్కో చక్రానికి పది లేక పదిహేను పర్యాయాల వరకూ చెయ్య వచ్చు. చక్రధ్యానాన్ని గురుముఖతా నేర్చుకొని చెయ్యాలని చెబుతారు. దీనికి అనువైన స్థలంలో
కూర్చోవాలి. ఆసనం స్థిరంగాను, వెన్నెముక నిటారుగాను ఉండాలి. కళ్ళు మూసుకొని పైన
చెప్పిన విషయాలను మనస్సులో ఊహించు కొంటూ అంటే పటంలో చూపిన విధంగా నాలుగు దళములు
కల్గిన కమలాన్ని , దాన్లో చతురస్రాకారపు స్థలాన్ని , దాన్లో ఎర్రనిత్రిభుజాన్ని,
కోణం క్రిందికి ఉన్నట్లు గాను,ఈ
త్రిభుజంలో బూడిద రంగు గల శివలింగం. శివలింగం చుట్టూ మూడున్నర చుట్లు కల్గి పడగ
విప్పిన సర్పం ఉన్నట్లూ, బీజాక్షరం చెబుతున్నప్పుడు పాము యొక్క పడగ నెమ్మదిగా పైకి
లేస్తున్నట్లుగాను భావించాలి.
స్వాధిష్టానము
స్వాధిష్టానము
సుషున్నూ నాడియందు లింగమునకు క్రింద భాగమున/లింగమూలమున ఉంటుంది. విద్యుల్లతలా ప్రకాశించేదీ, తెల్లనిరంగుతో, అర్ధ చంద్రాకారంలో ఉంటుంది. శుభ్రవర్ణము కలదని చెప్పబడింది. ప్రాణ వాయువునకు ఆధారమగుటచే స్వాధిష్టానమని పిలువబడుతోంది. జలభూత సంబంధమైన
ఆరు దళముల పద్మము. జలభూత సంబంధముచే జిహ్వేంద్రియము యొక్క ఆరు
రుచులు తెలియబడు తున్నాయి. అవి తీపి, పులుపు, కారము, చేదు, ఉప్పు, వగరు అనే రస విషయములు స్వాధిష్టానమున
తెలియబడు తున్నాయి. సరస్వతీ దేవితో కూడిన బ్రహ్మదేవుడు దీనికి అధిపతి. ఇచ్చట నాదము
చిణి చిణి. మూత్ర విసర్జన, శుక్లశోణితముల విసర్జన
జలస్థానమున తెలియ నగును. ప్రాణ వాయువునకు స్వస్థానం అవడం చేత ప్రాణమయ కోశానికి
ఉపాధి స్థానము.
స్వాధిష్టాన చక్రము ఆరు దళములు కల్గిన
పద్మము. పంచేంద్రియములకు, మనస్సునకు అధిపతిగ
పనిచేస్తుంది. సహస్రారము తప్ప మిగిలిన ఆరు చక్రములకును ఈ కేంద్రమునుండే ప్రాణశక్తి
లభిస్తోంది. శరీరమునకు వేడిమిని ఇస్తుంది. తల్లి గర్భమున స్థావరమేర్పడుటకు
మూలాధారము కారణముకాగా, పిండమునకు తదుపరి భౌతికముగ
వలయు ప్రాణశక్తిని ఇదే ఇస్తోందని అంటారు. స్త్రీ పురుషులలో యౌవ్వనము అంకురించుటకును, వారి భౌతిక దేహములందు మార్పులుకల్గి
శరీర సౌందర్య లావణ్యములు కల్పించి ఒకరిపై ఒకరికి ఆకర్షణను
కల్గించుచున్నది. శరీరమునకు విశ్రాంతి వలయునపుడు ఇందలి శక్తియే నిద్రను కల్పించు
చున్నది.
దీనికి "వం" అను బీజాక్షరమును ధ్యానించుచు, దీని రూపమును చింతించు
వానికి అహంకార, ఆవేశములు ఉద్రేకము పోవును. భావనలు, కల్పనలు పుట్టి
కావ్యములల్లుట మొదలగు ప్రవృత్తులు మేల్కొనును.
స్వాధిష్టానం బీజాక్షరం - వంగ్. ఆరు
దళములు కల్గిన నారింజపండు రంగు/సిందూర వర్ణము గల పద్మము. దాని మధ్య తెల్లని ఆకాశం.
దాని అంచున నీలిరంగు రింగ్ ఉంటుంది. బీజాక్షరాన్ని ఉచ్చరించే టపుడు మూలాధారానికి చెప్పినట్లే ఝంకారము, సమయము
మొదలైనవి గుర్తుంచుకోవాలి.
No comments:
Post a Comment