వైరాగ్యము
ఇంద్రియాలెప్పుడూ విషయసుఖాలను అపేక్షిస్తాయి. కోరికలను కలుగ జేస్తుంటాయి. మనం చెయ్యాల్సిన పనులెన్నో ఉంటాయి. ముందుగా మనం చెయ్యకూడని పనులను వదిలెయ్యాలి. వైరాగ్యంఅంటే ఎలాంటి కోరికా లేకుండా ఉండటం. అంటే కోరికలను విడిచిపెట్టడం.
బ్రహ్పదవి మొదలుకొని గడ్డిపోచ దాకా
ఉండే సృష్టి అంతటమీదా, ఎలాంటి కోరికాలేకుండా ఉండటం వైరాగ్యం. అంటే ఈలోకంలో ఉండే సుఖాలనుండి పరలోకసుఖాల పర్యంతమూ, ఏవిధమైన కోరికా లేకుండటమే గాక ఏహ్యభావం /జుగుప్స/రోత కలిగి ఉండటాన్ని వైరాగ్యం
తెలియజేస్తుంది. ఈ ఏహ్యభావం ఎలాంటి దంటే కాకిరెట్ట మీద ఎట్టి ఏహ్యభావం ఉంటుందో, అలా అన్నివిషయాల పట్లా ఎంతమాత్రమూ ఆకర్షణలేకుండా ఉండట
మన్నమాట. అంటే చూసే వస్తువులన్నిటినీ విడిచిపెట్టాలనే భావనకలిగి ఉండటం.
మన్నమాట. అంటే చూసే వస్తువులన్నిటినీ విడిచిపెట్టాలనే భావనకలిగి ఉండటం.
మనస్సు మనకు తెలియకుండానే విషయాలవేపుకి పోతుంటుంది.
అప్పుడు బుద్దిచేత అట్టివిషయాల వ్యర్ధత్వాన్ని, వాటి మిధ్యత్వ, అశాశ్వతత్వాన్ని గుర్తుచేసుకుని,
మనస్సును వాటినుంచి మళ్ళిస్తూ ఉండాలి. దీనికే వైరాగ్యం అవుసరం. వైరాగ్యంతోఉన్న మనస్సు, విషయవాంఛలవేపుకి పరుగులు తీయదు. అలాంటి మనస్సే ఉన్నతమైన
ధ్యానంలో నిశ్చలంగా ఉండగల్గుతుంది.
కర్మమార్గంలో ఉండేవారు
కూడా యజ్ఞయాగాదులు చేసి
సంపాదించే స్వర్గసుఖంకూడ
అనిత్యమని తెలిసి, వారు వైరాగ్యాన్ని అభ్యసిస్తారు. అప్పుడే బ్రహ్మజిజ్ఞాసకు పూనుకుంటారు. సాధకుడు కోరికచేత
చంపబడని వాడు కావాలి. ఎలాంటి
కోరికైనా మనస్సును ఆక్రమిస్తే, దాన్ని
త్యజించటమే వైరాగ్యం. వైరాగ్యంవల్ల
చిత్తము యొక్క చంచలత్వం
అదుపులోకి వస్తుంది.
మనం
వింటున్నదానిమీద గాని, విన్నదానిమీదగాని,
వినబోయే దానిమీద గాని కోరిక
ఉండకూడదు. అలాగే చూస్తున్న దానిమీద గాని, చూసిన
దానిమీదగాని , చూడబోయే
దానిమీదగాని ఎలాంటి కోరికా
ఉండకూడదు. ఇలా యివన్నీ కలిపితే, దాన్ని వైరాగ్యమని చెప్పవచ్చు. దేనిమీదైనా
అనురాగం కలిగితే, అది కోరికగా
మారుతుంది. అంటే కోరికకూ, అనురాగానికీ కార్యకారణసంబంధం ఉంటుంది.
అందుకే
వివేకవైరాగ్యాలు కలిసే ఉండాలి. ఏది
నిత్యం, ఏది అనిత్యం అనేది
గ్రహించి వైరాగ్యంతో అనిత్యమైన వాటిని గెంటివెయ్యాలి. అలా సమబుద్ధి
కలిగి ఉండటం సాధనకు తొలిమెట్టు. సాధనచతుష్టయంలో అంగాలను
మనకు తెలియడానికి ఒకదాని తర్వాత
మరొకటిగా ఒక క్రమపద్ధతిలో చెబుతున్నా, అన్నిటినీ కలిపి ఒకేమారు సాధనలో కొనసాగించాలి. అంటే ఒకదానిపై
ఎక్కువఏకాగ్రత, మరొకదానిపై కొంచెం తక్కువ
ఏకాగ్రతా ఉంచుతూ అభ్యాసం ముందుకు సాగాలి.
No comments:
Post a Comment