పంచ కోశములు-3-------------------------------
ఆనందమయ కోశము :
ఇది విజ్ఞానమయ కోశానికి లోపల ఉంటుంది. మలిన సత్వప్రధానమైన ప్రకృతి నుండి అవిద్యచే
ఏర్పడిన కారణ శరీరమే, ఆనందమనే పరిణామంతో కలసి
ఆనందమయ కోశమవుతోంది. అంటే పుణ్య కర్మల ఫలాన్ని అనుభవించే టపుడు కలిగే సుఖంచేత,
బుద్ది అంతర్ముఖమై సచ్చిదానందాన్ని అనుభవిస్తుంది. పుణ్యఫలం క్షయించ గానే; నిద్రా రూపాన లయిస్తుంది. అంచేత ఒకప్పుడు
ఉండి, మరొకపుడు లేకపోడంవల్ల ఇది ఆత్మ కాజాలదు. అజ్ఞానము, ప్రియము, మోదము అనేవి
దీని ధర్మములు. ఆనందమయము అంటే ఆనందము విస్తారంగా కలది అని అర్ధం. అంటే ఆనందము
కానిది కొంత ఉన్నదని భావము. కనుక ఇదీ ఆత్మ కాదు.
ఆనందమయ కోశమునకు లోపల ఉండి , ఆనందమయ కోశమంతా వ్యాపించి ఉంటుంది. దీని యొక్క ఆత్మఐన ఆనందమే బ్రహ్మము. అతడే ఆత్మ. అనగా ఆనంద మయకోశము ఆత్మకాదని నిశ్చయించి, ఇలా నిషేధిస్తూ పోగా మిగిలిన నిరతిశయ, నిరుపాధిక ఆనంద స్వరూపమే ఆత్మ, అదే బ్రహ్మము, భూమ అని నిశ్చయం చెయ్యాలి. ఆత్మ నుంచే ఆనంద మయాది పంచకోశములూ కలిగాయి. ఆత్మ మరోదాన్లో ప్రతిష్టించ బడలేదు. అదీ గాక ఆత్మ సర్వాన్ని తెలుసుకునే బోధస్వరూపమని నిశ్చయానికి రావాలి. ఎవరీ విధంగా పంచకోశ విచారము చేసి ఆత్మను తెలుసుకుంటారో, వారే బ్రహ్మవిదులని చెప్పబడింది.

ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు మూడూ సూక్ష్మ శరీరం లోనివే. గుణ భేదము,
అవస్థా భేదముల చేత వేర్వేరుగా చెప్ప బడుతున్నాయి.
మన నిత్య జీవితంలో అవస్థా త్రయం అంటే –
జాగ్రదావస్థ ( పూర్తి మెలకువతో ఉండె స్థితి)
జాగ్రదావస్థ ( పూర్తి మెలకువతో ఉండె స్థితి)
స్వప్నావస్థ – అంటే కలలుగనే స్థితి
నిద్రావస్థ – గాఢ నిద్రలో ఉండే స్థితి. దీన్నే సుషుప్తావస్థ అంటారు కూడ.
ఒక అంతఃకరణమే ఉపకరణము, కర్త , భోక్తలుగా పనిచేస్తుంది. ఇలా పనిచేయించేది ప్రజ్ఞ/ఆత్మ. ఆత్మ ఈ అయిదు కోశములకంటే
భిన్నమైనా ఈ కోశములతో ఐక్యం చెందటంవల్ల వాటి ధర్మములను
తనకు ఆరోపించు కుంటుంది. వాస్తవానికి వీటిని ఎవడు అనుభవిస్తున్నాడో అతడే
ప్రజ్న/ఆత్మ. ఆత్మ స్వయం అనుభూతి స్వరూపం. అదే బోధ / సాక్షి.