5) ప్రత్యాహారం
అలవాటుగా బయట
సంచరించే మనసును అరికట్టి, అంతర్గతంచేసి
ఇంద్రియాల నుంచి విముక్తి కలిగించటం. అంటే మనస్సును నిగ్రహించి చిత్తము స్వస్వరూపాన్ని పొందటమే. అంటే మనస్సుతో ఐక్యమవ్వడం అన్నమాట. దీన్నే ప్రత్యాహార మంటారు.
6) ధారణ
మనస్సుని
నిగ్రహించి వశంచేసుకున్న చిత్తాన్ని ఒక లక్ష్యంమీద నిల్పి ఉంచాలి. అలా
లక్ష్యాన్ని౦చి చెదిరి పోకుండా చిత్తాన్ని ఉంచడాన్ని ధారణ అంటారు.
7) ధ్యానము
చిత్తాన్ని
లక్ష్యం మీదనుంచి చెదరి పోకుండా ఉంచటం
వల్ల, అహం అనేది పోయి మనసు నశించి ధ్యేయ వస్తువే మిగిలి, అదే అవుతాడు. మనస్సును
ఏకభావ ప్రవాహంగా కొంతకాలం నిలప గలగటం- ధ్యానం. ధ్యానం గురించి విపులంగా తర్వాత తెలుసుకుందాం.
8) సమాధి
ఈ స్థితిలో
ఏలక్ష్యమూ లేకుండా చిత్తాన్ని ఉంచినపుడు జ్ఞాన స్వరూపమూ, శాశ్వతమూ, సర్వవ్యాప్తమై వెలిగే
స్వస్థితిని
సాధకుడు పొందుతాడు. అంటే అర్ధం మాత్రమే భాసిస్తుంది. ఇదే యోగుల గమ్యమైన సమాధిస్థితి.
సమాధులు సంప్రజ్ఞాత సమాధి, అసంప్రజ్ఞాత సమాధి అని రెండు రకాలు.
సంప్రజ్ఞాత సమాధి
- దీన్లో చిత్తవృత్తులు శాంతించే ఉంటాయి కాని బీజరూపంలో సంస్కారాలు మిగిలి, సమయం
వచ్చినపుడు తిరిగి మొలకెత్తడానికి అనువుగా ఉంటాయి. కాబట్టే దీన్ని సబీజ సమాధి
అంటారు. ధ్యాన, ధారణా, సబీజ సమాధులను పొందిన యోగికి సర్వశక్తులు, సర్వజ్ఞత్వము కలుగుతాయి గాని
ముక్తుడు కాలేడు. ఇంకా పునర్జన్మను కలిగించే కర్మబీజాలు ఉంటాయి. అణిమాది సిద్ధులు
కలుగుతాయి.
అసంప్రజ్ఞాత
సమాధి – దీన్లో నేను అనే అహంకారం ఉండదు. బీజరూపంలో ఉండే చిత్త వృత్తులు నశిస్తాయి.
కర్మబీజం దగ్ధమై ఉండటంవల్ల నిర్బీజ సమాధి అని అంటారు. దీన్లో వాసనలు నశించి,
మనోనాశనము కూడ కలగటం వల్ల, యోగి పరమాత్మను తెలిసికొని ముక్తిని పొందుతాడు.
Sir,
ReplyDeleteI have done pranayama and got some experiences. I want to share it.In early stage, my body trembles and slightly light pain like waves inside.After some days,this feeling subsided.Amazingly good concentration developed...my voice also has some sweet sound...quite often I felt it.I used to knew beforehand,whenever a person approaches me.
First I was afraid of it.In fact I am a person of trusting science only.Not God or any prejudices like pranayama.But I wanted to practice it as an experiment after reading Swami Vivekananda's Raja Yoga.
Now, after having my small experience, I understood The great Rishis power.Because they had sacrificed their lives for the cause . I don't have capacity to fathom their depths.
They are the real helpers to the mankind.They gave this great ultimate science to this land.
Your life is fulfilled by this articles.
......Murthy
Dear Murthy garu,
ReplyDeleteMystic experiences do take place during sadhana.But few people recognize them.You recognized them.if you continue your sadhana you will reap the benefits.Thanks for sharing your experiences.
your's
Dr. Surya Chandra Golla
Sir,
ReplyDeleteYour Words of Encouragement gave me new strength.Frankly speaking, from the last few years I have stopped sadhana due to my own reasons.But,certainly I can say I gained a lot even in terms with physical plane.Understood that this life is very small compared with its beyond.
Meeting people like you in the blog also a plan from that power only.Kindly write your experiences also which are useful enthusiasts.
.............Murthy
Dear Murthy garu,
ReplyDeleteSorry for the delay in replying. Thanks for the interest You have shown about my experiences. i plan to incorporate them in my blogs.
yours
Dr.Surya Chandra Golla