పంచ మహాభూతములు
గుణరహితమైన అత్మనుండి ఆకాశం కలిగింది.
సాంఖ్యుల ప్రకారం త్రిగుణాత్మకమైన ప్రకృతిలో, తమో గుణప్రధానమైన ప్రకృతి నుండి పంచ మహాభూతాలు కలిగాయని చెబుతారు. పంచమహాభూతాలు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృధివి అనే ఐదు.
ఆకాశము – ఇది శబ్దము లేక ప్రతిధ్వని
కలగడానికి ఆధారమైనది. అంటే దీన్లో శబ్దమనే గుణం ఉంది. ఇతర వస్తువులు
ఉండటానికి అవకాశం ఇచ్చేది కాబట్టి, దీన్ని ఆకాశం అని అంటారు.
వాయువు – దీన్లో బీసీ అనే ధ్వని, స్పర్శను కలిగించే విషయము/ తత్వము ఉంటాయి. అంటే
దీన్లో రెండు గుణాలున్నాయి.
అగ్ని – దీన్లో భుగ భుగ మనే శబ్దము, వేడిమిని కలిగించే స్పర్శ, కాంతిని కల్గించేదిగాను ; ఇలా మూడు గుణాలను కల్గి ఉంటుంది.
జలము – దీన్లో బులు బులు మనే
శబ్దము, చల్లని స్పర్శ, తెల్లని రంగు, రుచిని కలిగించే గుణము ; ఇలా నాల్గు గుణాలుంటాయి.
పృధివి – దీన్లో కట కట మనే శబ్దము, కఠిన స్పర్శ, అనేకమైన రంగులు, అన్ని రుచులూ, సువాసన దుర్వాసనలనే గంధగుణమూ; ఇలా ఐదు
గుణాలున్నాయి.
తమః ప్రధానమైన ప్రకృతి నుండి ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి పుట్టాయి. శబ్దం, స్పర్శ, రూపము, రసము, గంధము అనేవి ఈ పంచ మహాభూతాల గుణాలు. బ్రహ్మమును ఆధారంగా చేసుకుని ఏర్పడిన ఆకాశమే ప్రధమ వికారము. ఇది ముందు ఏర్పడ్డ భూతమవడంచేత బ్రహ్మలక్షణాలు ఉన్నట్లు చెబుతారు. ఇది జడమైనా ఏకము, అనంతము, సర్వగతమై యితర భూతములు ఉండటానికి అవకాశము కల్గిస్తుంది.
శ్రుతిలో అత్మనుంచే
ఆకాశము మొదలైన సృష్టి ఏర్పడుతోందని చెప్పడం వల్ల జగత్తు బ్రహ్మమున కన్న భిన్నం
కాదని తెలుస్తుంది. పృధివి నుంచి మిగిలిన భూతముల వేపుకి విచక్షణ చేస్తే, పోను పోను
ఒకో గుణం తగ్గుతూ చివరికి ఒకే గుణం కల్గిన ఆకాశం మిగులుతుంది. దానికి పైన
నిర్గుణమైన ఆత్మ తెలియబడుతుంది. ఇలా సృష్టిని తెలుసుకోవడం వల్ల బ్రహ్మమును
తెలుసుకో వీలై బంధం నుంచి విడువడి మోక్షానికి దారి తీస్తుంది.
తమః ప్రధానమైన ప్రకృతి నుండి ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి పుట్టాయి. శబ్దం, స్పర్శ, రూపము, రసము, గంధము అనేవి ఈ పంచ మహాభూతాల గుణాలు. బ్రహ్మమును ఆధారంగా చేసుకుని ఏర్పడిన ఆకాశమే ప్రధమ వికారము. ఇది ముందు ఏర్పడ్డ భూతమవడంచేత బ్రహ్మలక్షణాలు ఉన్నట్లు చెబుతారు. ఇది జడమైనా ఏకము, అనంతము, సర్వగతమై యితర భూతములు ఉండటానికి అవకాశము కల్గిస్తుంది.
బ్రహ్మము సర్వ
వ్యాపి. దీన్లో మాయ యొక్క వ్యాప్తి చాల తక్కువ. మాయా కార్యమైన ఆకాశము
వ్యాప్తి ఇంకా అల్పము. ఆకాశ కార్యమైన
వాయువు వ్యాప్తి దాని కంటే తక్కువ. అగ్ని వాయువు యొక్క పదవ భాగం చేత ఏర్పడింది.
అగ్ని యొక్క పదవ భాగం చేత జలము, జలము యొక్క పదవ భాగం చేత పృధివి ఏర్పడ్డాయి. భూమి
యొక్క దశాంశము వలన బ్రహ్మాండము ఇలా ఒకదాని కంటే మరొకటి సూక్ష్మ తరమై ఉన్నాయి.
చక్కటి విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
ReplyDeleteమీ అభిమానానికి కృతజ్ఞతలు.
ReplyDeleteసూర్యచంద్ర గోళ్ల