Saturday, June 2, 2012

తత్వ దర్శనములు (Tatva Darshanas)

భారతీయ తత్వచింతనలో, సృష్టికి కారణమైనవాడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు అయిన పరమాత్మ ఉన్నాడని నమ్మేవారిని , వేదాలను ప్రమాణంగా అంగీకరించేవారిని 'ఆస్తికులు' అంటారు. వేదప్రమాణాన్ని అంగీకరించక , దైవాన్ని నమ్మనివారిని 'నాస్తికులు' అని  అంటారు. నాస్తికులు మానవాతీతమైనదేదీ లేదనీ, సృష్టి కేవలం, స్త్రీపురుష సంపర్కంవల్ల జరుగుతోందని చెబుతారు . ఆస్తికులూ, నాస్తికులూ వారి అభిప్రాయాలను లేక వారుగ్రహించిన సత్యాలను దర్శనములరూపంలో పొందుపరచారు. తదనుగుణంగా ఆస్తికదర్శనాలనీ, నాస్తికదర్శనాలనీ ప్రాచుర్యంలోకి వచ్చాయి.

 ఆస్తిక దర్శనాలు :   పట్టిక
                      దర్శనాలు                                                 మూలపురుషులు         
     
సాంఖ్య దర్శనం              దీనికి ప్రధమ ఆచార్యుడు    కపిల ముని.
యోగ దర్శనం                 దీని  ఆచార్యుడు                  పతంజలి .
న్యాయ దర్శనం                        "                                 గౌతమ ముని.
వైశేషిక దర్శనం                        "                                 కణాద మహర్షి.  
పూర్వ మీమాంసా దర్శనం           "                               జైమిని.
ఉత్తర మీమాంసా దర్శనం            "                              బాదరాయణుడు.

ఈ ఋషీశ్వరులంతా, వారుదర్శించిన సత్యాలను వేర్వేరుగా చెప్పినా, వారంతా ఒకేసత్యాన్ని గమ్యంగా చెప్పినవారే. ఏవిధమైన సంశయము లేకుండా, ఎవరి అభిరుచినిబట్టి  వారు తమమార్గాన్ని ఎన్నుకొని, సాధనలద్వారా ప్రయత్నిస్తే;  వీటిలో ఏమార్గాన్ని ఎంచుకున్నా, గమ్యమైన పరమాత్మను చేరుకోవచ్చు. ఇవన్నీ వేద సమ్మతాలే.

వీటిలో విషయసారూప్యతనుబట్టి, మూడు సముదాయాలుగా చేర్చబడ్డాయి. సాంఖ్య, యోగ  దర్శనాలను కలిపి - సాంఖ్యశాస్త్రంగాను , న్యాయ, వైశేషికదర్శనాలను కలిపి తర్కశాస్త్రంగాను , పూర్వ,ఉత్తర మీమాంసాదర్శనాలను కలిపి,   మీమాంసా శాస్త్రంగాను పరిగణిస్తున్నారు.

నాస్తిక దర్శనాలు   
లోకాయతిక దర్శనం      దీనికి మూల పురుషుడు         చార్వాకుడు.             
జైన దర్శనం                  దీని వ్యవస్థాపకుడు                రిషభ దేవుడు .
బౌద్ధ దర్శనం                దీనికి మూల పురుషుడు          గౌతమ బుద్ధుడు.

ప్రతీ దర్శనాచార్యుడూ, తను బోధించినసత్యాన్ని తెలిసికోడానికి తగిన సాధనామార్గాన్ని కూడ నిర్దేశించడం జరిగింది. ఆస్తికదర్శనాలు ఎంత సత్యమో ; నాస్తికదర్శనాలు కూడ అంతేసత్యం.

No comments:

Post a Comment